
నేటి నుంచే మహానాడు
ఏపీలో వైకాపా పాలనతో నష్టాలను చాటిచెప్పే వ్యూహం
ఈనాడు డిజిటల్, ఒంగోలు: నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు, తెదేపా నలభై వసంతాల వేడుక సందర్భంగా శుక్రవారం ప్రారంభం కానున్న మహానాడుకు ఒంగోలు మండలంలోని మండువవారిపాలెం ఎన్నో ప్రత్యేకతలతో సర్వాంగ సుందరంగా ముస్తాబై పసుపుమయమైంది. మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా నష్టపోయింది.. భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఏం చేయాలి.. తెదేపా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఏమిటి అనే అంశాలను ఈ వేదిక నుంచి చాటేందుకు పార్టీ ముఖ్య నేతలు సన్నద్ధమవుతున్నారు. రానున్న ఎన్నికల సమరశంఖం కూడా ఇక్కడి నుంచే పూరించి.. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలిరోజు ఉదయమే ప్రతినిధుల వివరాల నమోదు, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభమవుతాయి. పది గంటలకు ప్రధాన కార్యక్రమం మొదలవుతుంది. శనివారం... ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, తీర్మానాలతో పాటు, నాయకుల ప్రసంగాలు ఉంటాయి. ప్రధాన వేదికను 80 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవుతో తీర్చిదిద్దారు. మూడు లక్షలమందికి పైగా వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. ప్రాంగణానికి ఎడమ వైపున కాలువ పక్కగా 53 ఎకరాల సువిశాల స్థలంలో 10,000 వాహనాలు, గ్యాలరీకి వెనుక వైపు వీఐపీల వాహనాలు 2,000 వరకు పార్క్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
తెలుగు వంటకాలు
మూడేళ్ల విరామం తరువాత కార్యకర్తల నడుమ నిర్వహిస్తున్న వేడుక కావడంతో.. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తెలుగు సంస్కృతి సంప్రదాయకాలు ఉట్టిపడేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడకు చెందిన అంబికా క్యాటరింగ్‌కు ఈ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ అధినేత శివాజీ పర్యవేక్షణలో దాదాపు వెయ్యి మంది పాకశాస్త్ర ప్రవీణులు వంటకాలు తయారు చేస్తున్నారు. శాఖాహారంలో మామిడికాయ పప్పు, మునగకాయ - బీన్స్, బంగాళాదుంప, బీరకాయ - శనగపప్పు కూరలు, కొబ్బరి అన్నం వంటివాటితో పాటు.. ఉదయం అల్పాహారంగా రవ్వకేసరి, ఇడ్లీ, మైసూరు బోండా, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు, కారప్పొడి, నెయ్యి అందజేస్తారు.
కోనసీమ అల్లర్లకు వైకాపాయే కారణం: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: కోనసీమలో అల్లర్లకు వైకాపాయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో చిచ్చు రేపారన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మహానాడు కోసం మంగళగిరిలోని తెదేపా కార్యాలయం నుంచి ఒంగోలుకు ప్రదర్శనగా వెళ్లిన చంద్రబాబు దారిలో చిలకలూరిపేట సమీపంలో తెదేపా కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ‘క్విట్ జగన్... సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
-
General News
Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
-
Sports News
IND vs ENG: కెప్టెన్సీకి పంత్ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్ మాజీ క్రికెటర్
-
Politics News
Maharashtra: రెబల్స్‌లో సగం మంది మాతో టచ్‌లోనే..: సంజయ్ రౌత్
-
General News
Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..
-
Business News
Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఆవిష్కరణలకు అందలం
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాలు ఈనాడు.నెట్లో చూడొచ్చు
- Viveka Murder Case: శివశంకర్‌రెడ్డిదే కీలక పాత్ర
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..