సంజయ్‌ వ్యాఖ్యలు రాచరికానికి అద్దం

మత విద్వేషాలను రెచ్చగొట్టేలా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. సంజయ్‌ వ్యాఖ్యలు మధ్యయుగం నాటి

Published : 28 May 2022 05:45 IST

వాటిని ఖండిస్తున్నా: భట్టి విక్రమార్క

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మత విద్వేషాలను రెచ్చగొట్టేలా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. సంజయ్‌ వ్యాఖ్యలు మధ్యయుగం నాటి రాచరిక వ్యవస్థకు అద్దం పడుతున్నాయని, ఇది దురదృష్టకరమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం పేరిట కలహాలను సృష్టించేలా ఆయన వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. ఉర్దూ భాష భారతీయ భాషగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు దానిని రద్దు చేస్తామనడం అవివేకమన్నారు. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న భాజపా.. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేయాలనే వాదన తీసుకువచ్చే ప్రమాదం ఉందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు.  దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) విమర్శించారు. కాంగ్రెస్‌, భాజపాలను కాదని ఆయన ఏం చేయలేరన్నారు. జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ఉంటే రాష్ట్ర సమస్యలపై ఆయన్ను నిలదీసే అవకాశం ఉండేది కదా? అని అన్నారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానన్న మోదీ.. హైదరాబాద్‌ పర్యటనలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

నెహ్రూకు నివాళులు

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, పొన్నాల లక్ష్మయ్య, రాములు నాయక్‌, కుమార్‌రావు తదితరులు గాంధీభవన్‌లో నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు