మోదీకి దమ్ముంటే లోక్‌సభను రద్దు చేయాలి

ప్రధాని మోదీకి దమ్ముంటే వెంటనే లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని.. సీఎం కేసీఆర్‌ సైతం శాసనసభను రద్దు చేస్తారని, ఎవరి బలం ఎంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌లు సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు

Published : 28 May 2022 05:45 IST

మంత్రులు తలసాని, గంగుల సవాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధాని మోదీకి దమ్ముంటే వెంటనే లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని.. సీఎం కేసీఆర్‌ సైతం శాసనసభను రద్దు చేస్తారని, ఎవరి బలం ఎంతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌లు సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రులు శుక్రవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రులు ఎందుకు రావడం లేదో ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని తలసాని, గంగుల సూచించారు. నియంతృత్వానికి మారు పేరు మోదీ అని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, పీయూసీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే  చందర్‌లు విమర్శించారు. ‘‘రాష్ట్రం ఉనికిలోకి రాకముందే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఐటీఐఆర్‌ను రద్దుచేశారు. కేసీఆర్‌ది త్యాగాల కుటుంబం. భాజపా అంటే భారతీయ జగడాల పార్టీ’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని