నేటి నుంచి మాదిగల సంగ్రామ యాత్ర

ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం నుంచి మాదిగల సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో ఆయన

Published : 28 May 2022 05:45 IST

 తెలంగాణలో భాజపాకు అధికారం పగటి కలే: మంద కృష్ణమాదిగ

బౌద్ధనగర్‌, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం నుంచి మాదిగల సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 120 రోజులు కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం పగటి కలేనని.. ఒక్క పైసా భారం పడని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించలేని ఆ పార్టీ నేతలు రూ.లక్షల కోట్లు వెచ్చించి తెలంగాణను అభివృద్ధి చేయగలరా? అని ప్రశ్నించారు. వివాదాస్పద బిల్లులను పార్లమెంటులో ఆమోదింపజేసుకున్న భాజపా.. వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం దారుణమన్నారు. ఇక మాదిగల యుద్ధం కేంద్రంలోని భాజపాపైనేనని చెప్పారు. జూన్‌ 1 నుంచి ఏపీలోనూ యాత్ర చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని