Updated : 28 May 2022 07:55 IST

TDP and YSRCP: ఖర్చులో తెదేపా ప్రథమం.. మిగులులో వైకాపా

 విరాళాల వ్యయంలో భిన్న పంథా

ఈనాడు, దిల్లీ: వచ్చిన విరాళాలను ఖర్చు చేయకుండా అట్టే పెట్టుకున్న పార్టీల్లో వైకాపా దేశంలో మొదటి స్థానంలో నిలవగా.. వచ్చిన ఆదాయం కంటే 1,584.16% ఎక్కువగా ఖర్చు చేసి తెదేపా తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైకాపాకు రూ.107.89 కోట్ల విరాళాలు రాగా, ఆ పార్టీ కేవలం రూ.80 లక్షలే ఖర్చు చేసింది. ఇదే సంవత్సరం తెదేపాకు రూ.3.25 కోట్ల విరాళాలు రాగా రూ.54.76 కోట్లు వెచ్చించింది. తెరాసకు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది.

* 2020-21లో మొత్తం 31 ప్రాంతీయ పార్టీలకు రూ.529.41 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20లో వచ్చిన రూ.800.26 కోట్లతో పోల్చితే ఇది 34.96% తక్కువ.

* ఇందులో రూ.149.95 కోట్లతో డీఎంకే తొలి స్థానంలో నిలిచింది. వైకాపా (రూ.107.99 కోట్లు), బీజేడీ (రూ.73.34 కోట్లు), జేడీయూ (రూ.65.31 కోట్లు), తెరాస (రూ.37.65 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి. తెదేపా 11వ స్థానానికి పరిమితమైంది.

* అధిక మొత్తాన్ని మిగుల్చుకున్న పార్టీల్లో వైకాపా (99.25%) తర్వాత బీజేడీ (90.44%), ఎంఐఎం (88.02%) ఉన్నాయి.

* 31 పార్టీలకు రూ.376.86 కోట్లు (71%) స్వచ్ఛంద విరాళాల రూపంలో సమకూరాయి. ఇందులో రూ.250.60 కోట్లను పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో కూడగట్టుకున్నాయి. ఈ బాండ్ల మొత్తం కేవలం 5పార్టీలకే వెళ్లింది. ఇందులో వైకాపా (రూ.96.25 కోట్లు), డీఎంకే (రూ.80 కోట్లు), బీజేడీ (రూ.67 కోట్లు), ఆప్‌ (రూ.5.95 కోట్లు), జేడీయూ (రూ.1.40 కోట్లు) దక్కాయి. 31 పార్టీలకు వడ్డీ రూపంలో రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని