సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్‌కు లేదు

ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ ప్రజలు అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలతో జతకట్టి సంబంధాలు పెంచుకోవడానికి సిద్ధపడుతుండటం ఆయనకే నష్టమని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలే విమర్శించారు

Published : 28 May 2022 05:45 IST

 ఇతర రాష్ట్రాలతో జతకట్టడం ఆయనకే నష్టం

 కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలే విమర్శలు

ఎన్జీవోస్‌కాలనీ (హనుమకొండ), న్యూస్‌టుడే : ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ ప్రజలు అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలతో జతకట్టి సంబంధాలు పెంచుకోవడానికి సిద్ధపడుతుండటం ఆయనకే నష్టమని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్‌పీఐ) జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలే విమర్శించారు. ఏడేళ్ల నుంచి సంక్షేమ పథకాల పేరిట దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన ‘దళిత బహుజన రాజ్యాధికార చైతన్య బహిరంగ సభ’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే ఆందోళన చేయడం బాధాకరమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. అంబేడ్కర్‌ బతికి ఉంటే ప్రధాని అయ్యేవారన్నారు. అంతకు ముందు వరంగల్‌ నిట్‌ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, ఉచిత విద్య, వైద్యం అందిస్తానని హామీ ఇచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని