Updated : 28 May 2022 07:36 IST

CM KCR: దసరా నుంచి జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌

 హనుమకొండలో మంత్రి మల్లారెడ్డి

కాజీపేట, న్యూస్‌టుడే: వచ్చే విజయదశమి(దసరా) రోజున సీఎం కేసీఆర్‌ దేశరాజకీయాల్లో చక్రం తిప్పడానికి వెళ్తారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ఆ రోజు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాజపా పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్‌ విసిరారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని, ఆయన కొత్త బిచ్చగాడిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. పెండింగులో ఉన్న కార్మికుల దరఖాస్తులకు సంబంధించి నిధులు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వారి కోసం వరంగల్‌లో భవనం నిర్మిస్తామన్నారు.

రాష్ట్రంలోని కార్మికులకు లక్ష ద్విచక్రవాహనాలను ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని