అసమర్థ పాలనతోనే ఖజానా ఖాళీ

రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగానే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.  ప్రజాప్రస్థానం మూడో విడత పాదయాత్రను శనివారం ఖమ్మం జిల్లా తాళ్లమడ నుంచి శనివారం ఆమె తిరిగి ప్రారంభించారు.

Published : 29 May 2022 04:54 IST

మూడో విడత పాదయాత్రలో షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌- సత్తుపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగానే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.  ప్రజాప్రస్థానం మూడో విడత పాదయాత్రను శనివారం ఖమ్మం జిల్లా తాళ్లమడ నుంచి శనివారం ఆమె తిరిగి ప్రారంభించారు. కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ సందర్భంగా సభలో ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఇక్కడ రైతులు, నిరుద్యోగులు, పేదలను ఆదుకోకుండా పంజాబ్‌లో రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ఖజానా కేసీఆర్‌ కుటుంబం జేబుల్లోకే పోతోందని ఆరోపించారు. పాదయాత్రకు బయలుదేరటానికి ముందు హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజలకు అనుమానం వస్తోంది. ఖజానా ఖాళీ కావడం ఏమిటి? తెరాస ఖాతాలో రూ.860 కోట్లు ఉన్నాయంటే.. ఆ పార్టీ నాయకుల ఖాతాల్లో ఇంకెంత డబ్బుంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి రూ.వేలకోట్ల పెట్టుబడులు వస్తుంటే నిరుద్యోగ సమస్య ఎందుకు తీరడం లేదు?’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
* పాలనలో నూతన సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని షర్మిల ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని