రేపటి నుంచి మోదీ పాలన 8వ వార్షికోత్సవాలు: భాజపా

నరేంద్ర మోదీ పాలన 8వ వార్షికోత్సవాలను రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 14 వరకూ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌

Published : 29 May 2022 05:02 IST

దిల్లీ: నరేంద్ర మోదీ పాలన 8వ వార్షికోత్సవాలను రెండు వారాల పాటు ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 14 వరకూ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ శనివారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ‘‘మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలైన సేవ- సుపరిపాలన- పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాం. ఇందులో భాగంగా బూత్‌స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ప్రజలను కలిసేందుకు ప్రత్యేకంగా 75 గంటల కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మృతి చెందిన అనాథలైన పిల్లలకు మే 30న ప్రధాని చెక్కులు పంపిణీ చేస్తారు. వారికి ఉపకార వేతనాలపై ప్రకటన చేస్తారు’’ అని అరుణ్‌సింగ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని