Telangana Budget 2022: భారీగా పెరిగిన ప్రత్యేక అభివృద్ధి నిధి

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కింద 2022-23 ఏడాదికి కేటాయింపుల్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత బడ్జెట్‌తో పోల్చితే రూ.13,739 కోట్లు అదనంగా కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి

Updated : 08 Mar 2022 05:31 IST

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిపి రూ.47,350.37 కోట్లు

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కింద 2022-23 ఏడాదికి కేటాయింపుల్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత బడ్జెట్‌తో పోల్చితే రూ.13,739 కోట్లు అదనంగా కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల నిధులతో కలిపి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.47,350.37 కోట్లు చూపించింది. ప్రతిపాదించిన బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రూ.33,937.75 కోట్లు, ఎస్టీలకు రూ13,412.62 కోట్లుగా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల నిధులను మినహాయిస్తే వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఆయా ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.24,167.01కోట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని