రేషన్‌కార్డుదారులకు తపాలా సేవలు

రేషన్‌కార్డుదారులు తమ ఆధార్‌ సంఖ్యతో ఫోన్‌నంబరు లేదా ఐరిస్‌(కనుపాప) అనుసంధాన సేవల్ని పోస్టాఫీస్‌లలోని....

Published : 03 Feb 2021 04:07 IST

పోస్టాఫీసుల్లో ఆధార్‌తో ఐరిస్‌, ఫోన్‌ నంబరు అనుసంధానం

ఈనాడు, హైదరాబాద్‌: రేషన్‌కార్డుదారులు తమ ఆధార్‌ సంఖ్యతో ఫోన్‌నంబరు లేదా ఐరిస్‌(కనుపాప) అనుసంధాన సేవల్ని పోస్టాఫీస్‌లలోని ఆధార్‌ కేంద్రాల్లో పొందవచ్చని తపాలాశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలోని 28 జిల్లాల్లో 124 ఆధార్‌ కేంద్రాలు, 15 మొబైల్‌ కిట్ల ద్వారా ఈ సేవల్ని అందిస్తామని తెలంగాణ తపాలా సర్కిల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ తెలిపింది. ఆధార్‌ నంబరు అప్‌డేషన్‌కు రూ.50, ఐరిస్‌కి రూ.100, రెండింటికి రూ.100 ఛార్జి తీసుకోనున్నట్లు పేర్కొంది. రేషన్‌ సరుకుల పంపిణీలో బయోమెట్రిక్‌(వేలిముద్ర) తీసుకునే విధానం ఉండేది.
కరోనా నేపథ్యంలో వేలిముద్రకు బదులు ఐరిస్‌ లేదా మొబైల్‌నంబరు ఓటీపీ ద్వారా రేషన్‌ సరకుల పంపిణీ ఫిబ్రవరి 1 నుంచి మొదలైంది. ఆధార్‌ సంఖ్యతో మొబైల్‌ నంబరు అనుసంధానం అయితేనే ఓటీపీ వస్తుంది. చాలామంది ఇలా అనుసంధానం చేసుకోకపోవడంతో వారికి సంబంధహత సేవలు అందించడంపై తపాలాశాఖ దృష్టిపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని