Krishnapatnam: కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడొద్దు

ఏపీలోని ప్రతి జిల్లాలో ఐదు వేల మంది కరోనా బాధితులకు మందు ఉచితంగా అందజేస్తామని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ప్రకటించారు. ఆదివారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ..

Updated : 07 Jun 2021 07:09 IST

ఏపీలోని ప్రతి జిల్లాకు మందు సరఫరా: ఆనందయ్య

కృష్ణపట్నం, న్యూస్‌టుడే: ఏపీలోని ప్రతి జిల్లాలో ఐదు వేల మంది కరోనా బాధితులకు మందు ఉచితంగా అందజేస్తామని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ప్రకటించారు. ఆదివారం రాత్రి మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తొలుత సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేతుల మీదుగా మందు పంపిణీ ప్రారంభిస్తాం. జిల్లా అధికారులు పంపిణీపై నిర్ణయం తీసుకుంటారు. ఇతర ప్రాంతాల వారు కృష్ణపట్నం వచ్చి ఇబ్బందులు పడవద్దు. మిగతా ప్రాంతాలకు పంపిణీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామ’ని వివరించారు. మరోపక్క, ఆదివారం స్థానికులు, పరిసర ప్రాంతాల వారు కృష్ణపట్నం రాగా వారికి పరిమితంగా ఔషధాలు అందించారు. ఓ దశలో స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రద్దీ నెలకొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని