Sajjanar: ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపొద్దు: సజ్జనార్‌

ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రహదారి మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపటం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం, ట్రాఫిక్‌ పోలీసులు అపరాధ రుసుము విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాదు, క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుంది..

Updated : 28 Sep 2021 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రహదారి మధ్యలో ఆర్టీసీ బస్సులు ఆపటం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధం, ట్రాఫిక్‌ పోలీసులు అపరాధ రుసుము విధిస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్ల నుంచి వసూలు చేయటమే కాదు, క్రమశిక్షణ చర్యలు సైతం తీసుకోవాల్సి వస్తుంది.. అని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బస్సులు రహదారి మధ్య ఆపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. సంస్థకున్న పరపతిని పెంచుకోవాలి. ఉన్న దాన్ని కాపాడుకోవాలి. రహదారి మధ్య బస్సులను ఆపటం నేరమన్న విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయాలి. అందుకోసం డిపోల నుంచి రహదారులపైకి వచ్చే ముందు డీజిల్‌ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటుచేయాలి. డ్యూటీ ఛార్టులు ఇచ్చే ముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు వివరించి చెప్పాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించే విషయాన్ని వివరించాలి.. అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని