రాజ్యాంగ స్ఫూర్తిని నింపాలి

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అది మూలస్తంభమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాజ్యాంగ ఔన్నత్యం, ఆదర్శాలు, విలువలను నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత...

Updated : 27 Nov 2021 06:10 IST

గవర్నర్‌ తమిళిసై ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అది మూలస్తంభమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాజ్యాంగ ఔన్నత్యం, ఆదర్శాలు, విలువలను నిలబెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్‌ మాట్లాడుతూ అన్ని స్థాయుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని నింపడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి అని అన్నారు. దేశంలోని రాజ్యాంగ ఔన్నత్యాన్ని, చట్టబద్ధ పాలనను పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు ప్రజలందరూ పునరంకితం కావాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఉద్బోధించారు. ఈ సందర్భంగా గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, మంత్రులు  మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని