టెక్‌మహీంద్ర వర్సిటీలో 25 మంది విద్యార్థులకు కరోనా

బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, అయిదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ సోకడంతో శుక్రవారం యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. వర్సిటీలోని

Published : 27 Nov 2021 04:06 IST

దుండిగల్‌, న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: బహదూర్‌పల్లిలోని టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, అయిదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ సోకడంతో శుక్రవారం యూనివర్సిటీకి సెలవు ప్రకటించారు. వర్సిటీలోని వసతి గృహాన్ని విద్యార్థులు ఖాళీ చేసి యూనివర్సిటీ బయట పెద్ద సంఖ్యలో గూమిగూడటంతో ఈ విషయం బయటకు తెలిసింది. ఈ మేరకు మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో, దుండిగల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్మల నిర్ధారించారు.

కొత్తగా 171 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 171 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,75,319కి పెరిగింది. మహమ్మారితోమరొకరు మృతిచెందగా.. ఇప్పటి వరకూ 3,987 మంది కన్నుమూశారు. తాజాగా 167 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా.. మొత్తంగా 6,67,798 మంది కోలుకున్నారు. ఈ నెల 26న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని