పేస్కేలు అమలు చేయాలని వీఆర్‌ఏల నిరసన

గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శుక్రవారం పలు జిల్లాల్లో వీఆర్‌ఏలు నిరసనలు తెలిపారు. అనంతరం సమస్యలకు సంబంధించి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

Published : 27 Nov 2021 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ శుక్రవారం పలు జిల్లాల్లో వీఆర్‌ఏలు నిరసనలు తెలిపారు. అనంతరం సమస్యలకు సంబంధించి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వీరి ఇబ్బందులపై శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ డైరెక్ట్‌ రిక్రూట్‌ వీఆర్‌ఏల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కె.బాపుదేవ్‌ ఓప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం శాసనసభలో పేస్కేలు, పదోన్నతులపై ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. ఈనెల 24న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ గ్రామ వీఆర్‌ఏ రమేశ్‌ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం వెనుక పేస్కేలు అమలుకాకపోవడమే కారణమన్నారు. గతేడాది వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో వీఆర్‌ఏలకు పదోన్నతులులేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని