విద్యుత్‌ కొనుగోలు మరింత భారం

విద్యుత్‌ కొనుగోలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇటీవల కాలంలో ఎగబాకిన గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, బొగ్గు ధరలకు అనుగుణంగా విద్యుత్‌ కొనుగోలు ధరలు కూడా పెంచడానికి అనుమతిస్తూ ‘కేంద్ర విద్యుత్‌

Updated : 27 Nov 2021 06:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోలు ధరలు మరింత పెరగనున్నాయి. ఇటీవల కాలంలో ఎగబాకిన గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, బొగ్గు ధరలకు అనుగుణంగా విద్యుత్‌ కొనుగోలు ధరలు కూడా పెంచడానికి అనుమతిస్తూ ‘కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(సీఈఆర్‌సీ) ఉత్తర్వులు జారీచేసింది. అంతర్రాష్ట్ర విద్యుత్‌ లైన్ల కిరాయి రేట్లను కూడా ఏటా 6.07 శాతం అదనంగా పెంచడానికి అనుమతిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. గత నెల 1 నుంచి వచ్చే మార్చి 31 వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధరల ప్రకారం 115.33 శాతం, దిగుమతి చేసుకునే బొగ్గు రవాణా ఛార్జీలపై 63.12, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై 63.12, దీని రవాణాపై 7.62 శాతం రేటు అదనంగా పెంచుకోవచ్చని సీఈఆర్‌సీ.. తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు, ఇతర దేశాల నుంచి బొగ్గు కొనే విద్యుత్‌ కేంద్రాలపై ధరల పెంపు భారం పడనుంది. ఈ మేరకు విద్యుత్‌ సరఫరా వ్యయం పెరగనుంది. భష్యత్తులో ఈ కొనుగోలు భారాన్ని ఛార్జీల రూపంలో ప్రజలపై విద్యుత్‌ పంపిణీ సంస్థలు మోపుతాయి. లేనిపక్షంలో ప్రభుత్వం రాయితీ రూపంలో ఈ సంస్థలకు నిధులివ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు