తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ

Published : 27 Nov 2021 04:28 IST

ముషీరాబాద్‌, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఫలితంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడి కొలువులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేతలు నర్సింహాగౌడ్‌, కృష్ణయాదవ్‌, రవితేజ, నాగమణి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని