Updated : 27/11/2021 09:27 IST

Telugu Akademi Scam: తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో మలుపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు చేపట్టగా.. విచారణ మాత్రం ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో జరగనుంది. ఈ కేసులో క్రిమినల్‌ చర్యలతోపాటు అధికార దుర్వినియోగం ఇమిడి ఉండటంతో సీసీఎస్‌ పోలీసులు ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ సెక్షన్లను జోడించారు. దీంతో కేసు విచారణ ఏసీబీ న్యాయస్థానానికి బదిలీ కానుంది. తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వెంకట కోటి సాయికుమార్‌ ముఠా కాజేసిన సంగతి తెలిసిందే. ముఠాసభ్యులు జనవరి నుంచి ఆగస్టు వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్మును విడతల వారీగా కొల్లగొట్టారు. ఈ కుంభకోణంలో మొత్తం 18 మంది పాత్రను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. వీరిని ఇప్పటికే అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో తెలుగు అకాడమీ ఏవో రమేశ్‌తోపాటు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉండటంతో ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ సెక్షన్లు జోడించారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని