Updated : 28/11/2021 09:47 IST

TS News: ‘గరుడ’తో సులభంగా ఓటరు నమోదు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: ఓటరు నమోదు ప్రక్రియ సులువుగా సాగేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ‘గరుడ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) శశాంక్‌ గోయల్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌లో ఈవీఎం స్టోరేజీ స్ట్రాంగ్‌ రూంను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ యాప్‌ ద్వారా పారదర్శకత ఉంటుందని చెప్పారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌లను భద్రపరిచేందుకు ప్రతి జిల్లాలో స్ట్రాంగ్‌ రూం, గోదాము ఉండాలని నిర్ణయించామని తెలిపారు. కామారెడ్డి, నారాయణపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల సమయంలో దరఖాస్తులను చించివేయడంపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిని ఎన్నికల కమిషన్‌కు పంపించామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన చెప్పారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని