మళ్లీ పుస్తకాల పండగ!

కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన  పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు...

Published : 28 Nov 2021 05:24 IST

రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌  
డిసెంబరు 18 నుంచి 27 వరకు నిర్వహణ

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న నటుడు నారాయణమూర్తి, హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన  పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు ఏటా ఇక్కడ కొలువు తీరుతాయి. నిత్యం ప్రముఖులు, రచయితలతో చర్చలు, సమావేశాలు, వేలాదిగా తరలి వచ్చే చదువరులతో ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా డిసెంబరు 18 నుంచి 27 వరకు 34వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ వెల్లడించారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి 9 గంటల దాకా, ఇతర రోజుల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 దాకా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని తెలంగాణ సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పుస్తకాలు జ్ఞాన దీపాలని అన్నారు. శనివారం హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, నటుడు ఆర్‌.నారాయణమూర్తి మంత్రిని కలిసి.. పుస్తక ప్రదర్శనకు సహకరించాలని కోరారు. సంగీత, నాటక అకాడమీ ఛైర్మన్‌ శివకుమార్‌, డాక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు