నిర్మాణ నైపుణ్యానికో వర్సిటీ!

హైదరాబాద్‌లోని జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్‌)ను విశ్వవిద్యాలయ స్థాయికి పెంచేందుకున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని న్యాక్‌ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన ....

Published : 28 Nov 2021 05:24 IST

అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ
న్యాక్‌ కార్యవర్గం నిర్ణయం: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్‌)ను విశ్వవిద్యాలయ స్థాయికి పెంచేందుకున్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని న్యాక్‌ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం కార్యవర్గ సమావేశం జరిగింది. నిర్మాణ రంగంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని సమావేశంలో పలువురు సభ్యులు ప్రతిపాదించారు. అందుకు అవసరమైన సదుపాయాలు న్యాక్‌లో ఉన్నాయని సభ్యులు చెప్పడంతో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. రహదారులు-భవనాల శాఖ కార్యదర్శి, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నుంచి ఒక్కో ప్రతినిధిని ఆ కమిటీలో నియమించారు. ఈ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా మరింత లోతుగా అధ్యయనం చేయాలని సమావేశం నిర్ణయించింది. దీంతోపాటు బీటెక్‌ చదివిన వారికి ఏడాది కాల వ్యవధితో పీజీ డిప్లొమా కోర్సులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, న్యాక్‌లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతన శ్లాబులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని విభాగాల ఉద్యోగులకు పీఆర్సీ అమలు విషయంలో నివేదిక రూపొందించాల్సిందిగా సమావేశం కోరింది. అనంతరం న్యాక్‌ ప్రాంగణంలో స్క్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ఇండియా ఫౌండేషన్‌ ఏర్పాటుచేసిన సోలార్‌ శిక్షణ ల్యాబ్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రహదారులు-భవనాల శాఖ కార్యదర్శి కె.ఎస్‌.శ్రీనివాసరాజు, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.భిక్షపతి, బిల్డర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు వి.భాస్కరరెడ్డి, నిర్మాణ రంగ ప్రతినిధులు ఎస్‌.నరసింహారెడ్డి, సి.శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు