ప్రతి వైద్య విధానానిదీ ఓ ప్రత్యేకత

ప్రపంచంలో అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చినజీయర్‌ స్వామి అన్నారు. ఒక విధానంలో తయారు చేసిన ఔషధం పనిచేస్తున్నప్పుడు దాన్ని రూపొందించిన

Updated : 29 Nov 2021 05:55 IST

మంచివాటిని ప్రోత్సహించాలి: చినజీయర్‌ స్వామి

సదస్సులో ప్రసంగిస్తున్న చినజీయర్‌ స్వామి. పక్కన యశోదా ఆసుపత్రి ప్రతినిధులు డాక్టర్‌ పవన్‌, డాక్టర్‌ హరికిషన్‌ తదితరులు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలో అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో ప్రతిదానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుందని చినజీయర్‌ స్వామి అన్నారు. ఒక విధానంలో తయారు చేసిన ఔషధం పనిచేస్తున్నప్పుడు దాన్ని రూపొందించిన వ్యక్తుల విద్యను, విధానాన్ని బట్టి ఆ మందును నిలిపివేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో యశోద హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో బ్రాంకోస్‌ 2021 పేరిట నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చినజీయర్‌ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రతి వైద్య విధానానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఏదైనా ఔషధం పనిచేస్తున్నప్పుడు ఇది మా పుస్తకాల్లో లేదని దాన్ని అంగీకరించకపోవడం సరికాదు. అలాంటి మందుపై లోతైన పరిశోధనలు చేసి అవసరమైన సహకారం అందించాలి. మంచి చేసే వాటిని తప్పక ఆహ్వానించాలి. కరోనా సమయంలో ఆనందయ్య తయారు చేసిన మందు విషయంలోనూ ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. కృత్రిమ వస్తువులు ఎక్కువగా వాడటం, కాలుష్యం కారణంగా ఆరోగ్య ప్రమాణాలు పడిపోతున్నాయి. కొవిడ్‌ పరిస్థితుల్లో ఊపిరితిత్తుల వైద్యానికి ప్రాముఖ్యం పెరిగింది. ఈ వైద్య విభాగంలో వస్తోన్న సరికొత్త పరిజ్ఞానం, సవాళ్లపై చర్చించేందుకు యశోద ఆసుపత్రి అంతర్జాతీయస్థాయి సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం’ అని అన్నారు. యశోద ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.ఎస్‌.రావు మాట్లాడుతూ.. వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే అత్యాధునిక వైద్య విధానాలను దక్షిణాదిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత తమ ఆసుపత్రి వైద్యులకే దక్కుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని