శ్రీరాముణ్ని దర్శించుకున్న అమరావతి రైతులు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల రామాలయాన్ని అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఆదివారం దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం

Published : 29 Nov 2021 04:45 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల రామాలయాన్ని అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఆదివారం దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రామాలయం ఆవరణలో మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని శ్రీసీతారాములను కోరుకున్నట్లు తెలిపారు. అమరావతి నుంచి బస్సులో బయలుదేరి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకొని అనంతరం పర్ణశాల రామాలయానికి వచ్చినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని