ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి: టీపీటీయూ

సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌(టీపీటీయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఆ సంఘం

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌(టీపీటీయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెరిగినందున కనీసం విద్యా వాలంటీర్లను నియమించాలని, పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, సంఘం వ్యవస్థాపకుడు వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని