ఇరుకు గదుల్లో పాఠం.. కరోనాకు ఊతం!

కరోనా మహమ్మారి పొంచి ఉండటంతో కొవిడ్‌ నిబంధనల మధ్య భౌతికదూరం పాటిస్తూ విద్యాసంస్థలు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గదుల కొరతతో కొన్ని పాఠశాలల్లో ఆ నిబంధనలు ఏ కోశానా అమలవడం

Published : 29 Nov 2021 04:45 IST

కరోనా మహమ్మారి పొంచి ఉండటంతో కొవిడ్‌ నిబంధనల మధ్య భౌతికదూరం పాటిస్తూ విద్యాసంస్థలు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గదుల కొరతతో కొన్ని పాఠశాలల్లో ఆ నిబంధనలు ఏ కోశానా అమలవడం లేదనడానికి సాక్ష్యమే ఈ చిత్రాలు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం బాలాజీనగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. 35 నుంచి 40 మంది విద్యార్థులకు కలిపి ఒక తరగతి గది ఉండాలి. ఈ పాఠశాలలో 900 మందికి కలిపి 10 గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఒక్కో గదిలో 60 నుంచి 80 మంది విద్యార్థులు భౌతికదూరం పాటించకుండా కిక్కిరిసి కూర్చుని పాఠాలు వింటున్నారు. బల్లలు లేక కొందరు విద్యార్థులు గదుల్లో నేలపైనే కూర్చుంటున్నారు. గదుల కొరత కారణంగా ఉపాధ్యాయులు కొన్ని తరగతులను చెట్ల కింద నిర్వహిస్తుండగా.. ఆ తరగతుల విద్యార్థులూ నేలపై కూర్చొనే పాఠాలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని