యాదాద్రిలో ‘కార్తిక’ కోలాహలం

కార్తిక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తజనులతో కోలాహలంగా మారింది. హరి, హరుల క్షేత్ర సందర్శనకు తెలుగు రాష్ట్రాల భక్తులు అధికసంఖ్యలో...

Published : 29 Nov 2021 04:45 IST

బాలాలయ ప్రాంగణంలో భక్తజనం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: కార్తిక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భక్తజనులతో కోలాహలంగా మారింది. హరి, హరుల క్షేత్ర సందర్శనకు తెలుగు రాష్ట్రాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పంచ నారసింహులను దర్శించి, పూజలు నిర్వహించారు. క్యూ షెడ్లు, మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండ కింద పాత గోశాల ప్రాంగణంలో నిర్వహించిన శ్రీసత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో 1215 జంటలు పాల్గొన్నాయి. ఆలయానికి ఆదివారం రూ.37,09,808 ఆదాయం సమకూరినట్లు ఈవో గీత తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని