కొత్త ఎమ్మెల్సీల పదవీకాలం అమలులోకి

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో కొత్తగా ఎన్నికైన ఆరుగురు తెరాస ఎమ్మెల్సీల పదవీ కాలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, పారుపాటి వెంకట్రామరెడ్డి,

Published : 02 Dec 2021 05:16 IST

నేడు ప్రమాణస్వీకారం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో కొత్తగా ఎన్నికైన ఆరుగురు తెరాస ఎమ్మెల్సీల పదవీ కాలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, పారుపాటి వెంకట్రామరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డిలు ఇటీవల ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీకాలం బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రభుత్వం ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా పేర్కొంది. గతంలో ఈ కోటాలో ఉన్న ఆరుగురు సభ్యుల పదవీకాలం గత జూన్‌ 3వ తేదీతో ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. వీరిలో బండా ప్రకాశ్‌ మినహా మిగిలిన అయిదుగురు గురువారం ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని