ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తాం

ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం

Published : 02 Dec 2021 05:16 IST

సీఎం జగన్‌తో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్‌ బృందం ప్రతినిధులు.. తొలిరోజు బుధవారం రాత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కె.రాజేశ్వరరావు, ఇతర సభ్యులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జెన్‌కో, డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం సహా పలు అంశాలు ప్రస్తావించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్తు బకాయిలు ఇప్పించాలని అధికారులు నీతి ఆయోగ్‌ బృందాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని