తిరుమల కనుమ దారిలో.. విరిగిపడిన కొండ చరియ

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్‌ రవీంద్ర..

Published : 02 Dec 2021 05:16 IST

తిరుమల రెండో కనుమ మార్గంలో ధ్వంసమైన రోడ్డు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారిలో బుధవారం ఉదయం బస్సు డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. కొండపైకి వెళ్లే మార్గంలో 13, 14, 15 కిలోమీటర్ల పరిధిలో భారీగా దుమ్ము, పొగ లేవడాన్ని గుర్తించిన డ్రైవర్‌ రవీంద్ర.. వెంటనే బస్సు ఆపి మెల్లిగా వెనక్కి నడిపించారు. అంతలోనే కొండచరియలు విరిగిపడుతూ బండరాళ్లు, మట్టి రోడ్డుపైకి జారాయి. బస్సు ముందుకువెళ్లి ఉంటే.. భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు, ప్రయాణికులు ఆందోళన చెందారు. రోడ్డు ధ్వంసం కావడంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు