ఎయిడ్స్‌ బాధితులకు ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలు

ఎయిడ్స్‌ బాధితుల కోసం వరంగల్‌, హైదరాబాద్‌లలో ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలలో బుధవారం అవగాహన

Published : 02 Dec 2021 05:16 IST

హైదరాబాద్‌, వరంగల్‌లలో ఏర్పాటు: మంత్రి హరీశ్‌రావు

ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఎయిడ్స్‌ బాధితుల కోసం వరంగల్‌, హైదరాబాద్‌లలో ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ వైద్యశాలలో బుధవారం అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న పకడ్బందీ కార్యక్రమాలతో రాష్ట్రంలో ఎయిడ్స్‌ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో 1.30 లక్షల మంది రోగులను గుర్తించామని, వీరిలో సుమారు 80 వేల మంది స్వచ్ఛందంగా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఛాతీ ఆసుపత్రి ఆవరణలో 1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి తెలిపారు.  కార్యక్రమంలో ఛాతీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.మహబూబ్‌ఖాన్‌, రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం(ఎస్‌ఏసీఎస్‌) డైరెక్టర్‌ ప్రీతి నీనా, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని