Published : 03/12/2021 05:46 IST

ఏపీకి రూ.243 కోట్ల జరిమానా

పోలవరం, మూడు ఎత్తిపోతల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఎన్జీటీ కొరడా

ఈనాడు, దిల్లీ: పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కొరడా ఝుళిపించింది. పోలవరం (ఇందిరాసాగర్‌), మూడు ఎత్తిపోతల పథకాలకు కలిపి రూ.243.16 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు నెలల్లోపు కాలుష్య నియంత్రణ మండలికి (ఏపీ పీసీబీ) చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పెంటపాటి పుల్లారావు, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల నిర్మాణాలు చేపడుతున్నారని జమ్ముల చౌదరయ్య, మడిశర్ల సత్యనారాయణ, వట్టి వసంతకుమార్‌ తదితరులు వేర్వేరుగా 2017 నుంచి ఎన్జీటీలో పిటిషన్లు దాఖలుచేశారు. వాస్తవాల నిర్ధారణకు ఎన్జీటీ నిపుణుల కమిటీలను నియమించింది. అనుమతులు తీసుకోకపోవడం, పర్యావరణ ఉల్లంఘనలు నిజమేనని ఆ కమిటీలు నిర్ధారించాయి. వీటి ఆధారంగా ఎన్జీటీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌, సభ్యులు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, జస్టిస్‌ బ్రిజేష్‌ సేథి, విషయ నిపుణుడు నగిన్‌ నందాలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని