ప్రైవేటు సంస్థలతో పర్యాటక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వేలోనూ ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, వారికి కావాల్సిన విధంగా ఒక్కో రైలులో 14 నుంచి 20 కోచ్‌ల వరకు ఎంపిక చేసుకోవచ్చని ద.మ.రైల్వే

Published : 03 Dec 2021 05:46 IST

దరఖాస్తులు ఆహ్వానించిన ద.మ.రైల్వే

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలోనూ ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, వారికి కావాల్సిన విధంగా ఒక్కో రైలులో 14 నుంచి 20 కోచ్‌ల వరకు ఎంపిక చేసుకోవచ్చని ద.మ.రైల్వే గురువారం ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్‌నిలయంలోని జోన్‌ ప్రధాన కార్యాలయంలో కస్టమర్‌ సపోర్ట్‌ యూనిట్‌ని ప్రారంభించింది. దేశంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ‘భారత్‌ గౌరవ్‌’ రైళ్లను ప్రకటించగా, అందుకు అనుగుణంగా ద.మ.రైల్వే కార్యాచరణ ప్రారంభించింది. ఆపరేటర్ల ఎంపికను 10 పనిదినాల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలు, వ్యక్తులు, భాగస్వామ్య, వ్యాపార సంస్థలు ప్రత్యేక రైళ్లను ఎంపిక చేసుకుని నడిపించవచ్చని, ఈ రైలు సర్వీసుల్లో ఛార్జీలను నిర్ణయించుకునే, పర్యాటక మార్గాల్ని ఎంచుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నట్లు వివరించింది. రైలు బోగీల లోపల, వెలుపలా వ్యాపార ప్రకటనలు ప్రదర్శించుకునే అవకాశాన్నీ కల్పించింది. ఆసక్తిగల సంస్థలు రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఆర్‌.సుదర్శన్‌ని లేదా  bharatgauravtrainsscr@gmail.com లో సంప్రదించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని