
Published : 03 Dec 2021 05:46 IST
యాదాద్రి స్వర్ణగోపురానికి రూ.50 లక్షల విరాళం
మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేస్తున్న ప్రతాప్‌రెడ్డి, దినేష్‌రెడ్డి
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: యాదాద్రిలో స్వర్ణగోపుర నిర్మాణానికి జూబ్లీహిల్స్‌కు చెందిన జీవీపీఆర్ మినరల్స్, వీరభద్ర మినరల్స్ అండ్ గ్రానైట్స్ ఎండీ జీవీ ప్రతాప్‌రెడ్డి, ఆయన తనయుడు, సంస్థ డైరెక్టర్ దినేష్‌రెడ్డి కిలో బంగారం విరాళం నిమిత్తం రూ.50 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు గురువారం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో యాదాద్రి ఆలయం స్వర్ణమయంగా మారుతోందని, ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో తామూ పాలుపంచుకోవాలనే ఆలోచనతో విరాళం అందించినట్లు వారు తెలపగా.. కేటీఆర్ అభినందించారు.
Tags :