సింగరేణి విద్యుత్తు కేంద్రానికి తొమ్మిదో స్థానం

విద్యుదుత్పత్తిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎస్‌టీపీపీ) దేశంలో 9వ స్థానంలో నిలిచిందని డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావు తెలిపారు. 25 కేంద్రాల్లో సింగరేణి 86.75 శాతం పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)

Published : 03 Dec 2021 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌, గోదావరిఖని, న్యూస్‌టుడే: విద్యుదుత్పత్తిలో సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎస్‌టీపీపీ) దేశంలో 9వ స్థానంలో నిలిచిందని డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావు తెలిపారు. 25 కేంద్రాల్లో సింగరేణి 86.75 శాతం పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించిందని పేర్కొన్నారు. సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల అధికారులతో గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుంచి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం 42,466 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిందని సత్యనారాయణరావు చెప్పారు. రెండు దశల్లో 209 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేశామని, వీటి ద్వారా రూ.85 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన వివరించారు. మూడో దశలో 81 మెగావాట్ల సోలార్‌ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. సింగరేణి థర్మల్‌ కేంద్రం ఆవరణలో నిర్మించనున్న 15 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని మే నాటికి పూర్తి చేయనున్నామని వెల్లడించారు. సమావేశంలో ఎస్‌టీపీపీ ముఖ్య అధికారి జె.ఎన్‌.సింగ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని