నంది గ్రెయిన్‌, ఎస్‌పీవై ఆగ్రోపై సీబీఐ కేసు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారన్న అభియోగాలపై నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థలపై సీబీఐ కేసు నమోదు

Published : 03 Dec 2021 05:46 IST

ఈనాడు, అమరావతి: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారన్న అభియోగాలపై నంది గ్రెయిన్‌ డెరివేటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. వాటి డైరెక్టర్లు, ప్రతినిధులైన వి.సురేష్‌కుమార్‌శాస్త్రి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, వి.శశిరెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చింది. ‘హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి నిందితులు కంపెనీ పేరుతో రుణాలు తీసుకుని వ్యక్తిగత లబ్ధికి మళ్లించుకున్నారు. బ్యాంక్‌కు రూ.61.86 కోట్ల మేర నష్టం కలిగించారు’ అంటూ అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని