Published : 03/12/2021 05:45 IST

సీఎం ఆమోదానికి ఉప సంఘం ప్రాథమిక నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌, భూ సమస్యలు, పరిష్కార మార్గాలపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. గురువారం మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మంత్రులు, అధికారులతో కూడిన ఉప సంఘం మూడోసారి సమావేశమైంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యవసరమైన వాటి పరిష్కారానికి పోర్టల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాడ్యూళ్లు, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వాటిపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఉప సంఘం దృష్టికి దాదాపు 46 సమస్యలు వచ్చినట్లు తెలిసింది. వాటిలో అత్యవసరంగా పరిష్కరించాల్సి వాటిని నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. సీఎం ఆమోదం లభించిన వెంటనే అమలుకు రెవెన్యూశాఖ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని