Updated : 03/12/2021 07:30 IST

Corona Vaccine: బూస్టర్‌ డోసు ఇవ్వట్లేదు: అడిగిన రాష్ట్రాలకు కేంద్రం సమాధానం

అదనపు డోసులు కోరిన ఏపీ, కర్ణాటక, కేరళ

ఈనాడు, అమరావతి: బూస్టర్‌ డోసు పంపిణీ కోసం అదనంగా టీకాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీకాల పంపిణీ పురోగతిని కేంద్ర అధికారులు సమీక్షించారు. ‘ఒమిక్రాన్‌’ నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోసు ఇచ్చే అవకాశం కల్పించాలని 3 రాష్ట్రాల అధికారులు కేంద్ర అధికారులను కోరారు. దీనిపై వారు స్పందించారు. ‘బూస్టర్‌ డోసు అవసరమని అధికారికంగా మీకు ఎవరు చెప్పారు? ఐసీఎంఆర్‌ సిఫార్సు చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. అప్పటివరకూ బూస్టర్‌ డోసు ప్రస్తావన వద్దు’ అని రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని