ఉపాధ్యాయ ఖాళీలు 22 వేలు!

రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు 22 వేలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఉపాధ్యాయ పోస్టులను కొత్త జిల్లాలు, కేడర్‌, సబ్జెక్టు, మాధ్యమం వారీగా విభజించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు 22 వేలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఉపాధ్యాయ పోస్టులను కొత్త జిల్లాలు, కేడర్‌, సబ్జెక్టు, మాధ్యమం వారీగా విభజించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 351 కేడర్లు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టులు 1.31 లక్షలు కాగా...ప్రస్తుతం పనిచేస్తున్న వారు 1.09 లక్షలు. 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే వాటినన్నిటినీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయరు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) ఖాళీలను 100 శాతం పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అదే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో 30 శాతం మాత్రమే నోటిఫికేషన్‌ ద్వారా నింపుతారు. మిగిలిన వాటిని ఎస్‌జీటీలకు పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) మార్గదర్శకాలు జారీ చేస్తే కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని