ప్రాథమిక పాఠశాలల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తద్వారా వారిని ప్రాథమిక విద్యకు మానసికంగా సంసిద్ధం చేసేందుకు

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తద్వారా వారిని ప్రాథమిక విద్యకు మానసికంగా సంసిద్ధం చేసేందుకు వీలవుతుందని వారు పేర్కొన్నారు. గురువారమిక్కడ విద్యాశాఖ, శిశు సంక్షేమశాఖ అధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, దివ్య దేవరాజన్‌, దేవసేనతో కలిసి మంత్రులు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 12,219 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వీటిని వీలైనంత త్వరగా ప్రాథమిక పాఠశాలలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టేట్‌హోమ్‌ పిల్లలకు ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ సంస్థ అందజేసిన బ్యాగులను మంత్రులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని