తెలంగాణకు ఇచ్చిన రుణం సద్వినియోగం

సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రుణం సద్వినియోగం అయిందని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో మల్లన్నసాగర్‌ను ...

Published : 03 Dec 2021 05:45 IST

నాబార్డు ఛైర్మన్‌ గోవిందరాజులు

నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు, సీజీఎం యడ్ల కృష్ణారావుకు మల్లన్నసాగర్‌ ఆకృతిని వివరిస్తున్న ఇంజినీర్లు

తొగుట, చిన్నకోడూరు, భువనగిరి గ్రామీణం- న్యూస్‌టుడే: సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రుణం సద్వినియోగం అయిందని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో మల్లన్నసాగర్‌ను పూర్తిచేశారని ప్రశంసించారు. నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యడ్ల కృష్ణారావుతో కలిసి గురువారం ఆయన హెలికాప్టర్‌లో వెళ్లి లక్ష్మి పంప్‌హౌస్‌, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ జలాశయాలను సందర్శించారు. మల్లన్నసాగర్‌ ఆకృతి, నిర్మాణం, ఇటీవల మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసిన విషయాలను కాళేశ్వరం ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) హరిరామ్‌, ఈఎన్‌సీ జనరల్‌ మురళీధర్‌లు వారికి వివరించారు. అనంతరం రంగనాయకసాగర్‌ కట్టపై నిర్మించిన నీటిపారుదల ఎస్‌ఈ కార్యాలయం, అతిథి గృహం, సొరంగ మార్గంలోని పంపుహౌస్‌, సర్జ్‌పూల్‌ను నాబార్డు ఉన్నతాధికారులు పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నృసింహ జలాశయాన్ని (బస్వాపురం) ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని