దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణలోని దివ్యాంగుల సంక్షేమానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక

Published : 03 Dec 2021 05:45 IST

మంత్రి కేటీఆర్‌కు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణలోని దివ్యాంగుల సంక్షేమానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కోరారు. గురువారం ప్రగతిభవన్‌లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. దివ్యాంగులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలని, బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల నియామకాల కోసం టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమించాలని, బధిరుల కోసం హైదరాబాద్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వాసుదేవరెడ్డి తెలిపారు.


మరిన్ని శిఖరాలను అధిరోహించాలి...

కేటీఆర్‌కు తన జీవితచరిత్ర పుస్తకాన్ని అందిస్తున్న పూర్ణ

తెలంగాణ పర్వతారోహకురాలు మలావత్‌ పూర్ణను అన్ని విధాలా ప్రభుత్వం ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆమె మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గురువారం పూర్ణ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తన జీవిత కథపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని