అయిదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన తెరాస ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డిలు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి

Published : 03 Dec 2021 05:45 IST

మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లతో నూతన ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, రవీందర్‌ రావు

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన తెరాస ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రామిరెడ్డిలు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి తన కార్యాలయంలో వారితో ప్రమాణం చేయించారు. మంత్రులు మహమూద్‌అలీ, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తామని, ఎల్లవేళలా ప్రజలకు సేవ చేస్తామని వెల్లడించారు. సీఎం పాలన దక్షత కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తామని, తమ నియోజకవర్గాలు, జిల్లాల ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏకగ్రీవమైన మరో ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ ఈ నెల 6 తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వీలుంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని