దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుపై పరిశీలన

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కమిషన్‌ల మాదిరిగానే దివ్యాంగుల కోసం దేశంలో జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిషన్‌ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర సామాజికన్యాయ శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌

Published : 04 Dec 2021 05:04 IST

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు కేంద్ర మంత్రి లేఖ  

ఈనాడు,హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా కమిషన్‌ల మాదిరిగానే దివ్యాంగుల కోసం దేశంలో జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిషన్‌ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర సామాజికన్యాయ శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, చట్ట, సామాజిక రక్షణ, హక్కుల పరిరక్షణ, విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల సాధన, సంక్షేమం, ప్రోత్సాహకాల కోసం ప్రత్యేకంగా జాతీయ, రాష్ట్ర కమిషన్‌ల ఏర్పాటు అవసరం ఉందని వినోద్‌కుమార్‌ ఇటీవల ఆయనకు లేఖ రాశారు. వివిధ దివ్యాంగ సంఘాల వినతులను దానికి జత చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి లేఖను సంబంధిత విభాగానికి పంపించామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని