
లండన్ నుంచి చింతల్‌కు కొవిడ్ బాధితురాలు
జీడిమెట్ల, న్యూస్‌టుడే: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తున్న వేళ.. ఓ మహిళ లండన్ నుంచి కరోనా పాజిటివ్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టడం కలకలం రేపుతోంది. పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లి గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చింతల్‌కు చెందిన ఓ మహిళ (36) లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె గురువారం సాయంత్రం అయిదేళ్ల కుమార్తెతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. అక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆమెకు పాజిటివ్‌గా తేలగా.. విమానాశ్రయ అధికారుల కళ్లుగప్పి చింతల్ చేరుకొన్నారు. అప్రమత్తమైన అధికారులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు, మండల వైద్యాధికారి నిర్మల, సిబ్బందితో కలసి ఆమె ఉంటున్న నివాసానికి చేరుకొన్నారు. తొలుత ఆమె ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. పోలీసులు నచ్చజెప్పడంతో వెళ్లేందుకు అంగీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.