
ఇంద్రేశం గ్రామంలో విద్యార్థులకు కరోనా
న్యూస్‌టుడే, యంత్రాంగం: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామం మహాత్మా జ్యోతిబా ఫులె బీసీ సంక్షేమ గురుకులంలో శుక్రవారం 19 మందికి కరోనా సోకింది. కొడంగల్ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) ఆదర్శ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, వంటమనిషి కొవిడ్ బారిన పడ్డారు. హనుమకొండ జిల్లా దామెర మండలం వెంకటాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు, సిద్దిపేట జిల్లా జగదేవపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థికి వైరస్ సోకింది. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.