
వారం పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన
తిరుపతిలో ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ హామీ
ఈనాడు డిజిటల్, తిరుపతి: వారం.. పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని ఏపీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. శుక్రవారం తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతమైన సరస్వతినగర్‌లో ఆయన పర్యటిస్తున్నప్పుడు కొందరు ఉద్యోగులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రజలతో మాట్లాడుతున్న సీఎం.. ‘ఇక్కడెవరో పీఆర్సీ గురించి మాట్లాడారు. వారినీ దగ్గరకు రమ్మనండి’ అన్నారు. పోలీసులు వారిని సీఎం దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్లు అక్కడకు రావడంతో సీఎం మాట్లాడుతూ, ‘వారం.. పది రోజుల్లో సెటిల్ చేసేస్తా’ అని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఉద్యోగులు.. ముఖ్యమంత్రికి జేజేలు పలికారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.