పాండవుల గుట్టల్లో రాష్ట్రకూట శాసనం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలోని పాండవుల గుట్టల్లో 9వ శతాబ్దపు నాటి రాష్ట్రకూట శాసనాన్ని కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త ప్లీచ్‌

Published : 04 Dec 2021 05:27 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలోని పాండవుల గుట్టల్లో 9వ శతాబ్దపు నాటి రాష్ట్రకూట శాసనాన్ని కనుగొన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు టార్చ్‌ సంస్థ కార్యదర్శి అరవింద్‌ ఆర్య తెలిపారు. ఇది 1100 ఏళ్ల కిందటి తెలుగు, కన్నడ శాసనమని చెప్పారు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఎదురు పాండవులుగా పిలిచే రాక్‌ షెల్టర్‌ పైకప్పుపై లేబుల్‌ శానసం కనిపించిదన్నారు. ఇందులో ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అని రాసి ఉందని, శాసనలిపి రాష్ట్రకూటుల కాలం (8-9వ శతాబ్దం) నాటిదని నిర్ధారించామన్నారు. కాజీపేట దర్గా శాసనం ఆధారంగా రాష్ట్రకూటుల కాలం నాటి శిల్పుల సంఘానికి ఉత్పత్తి పిడుగు అని అర్థముందన్నారు. పాండవుల గుట్టలను రాష్ట్రప్రభుత్వం పురావస్తు పరిరక్షిత ప్రదేశంగా గుర్తించి అభివృద్ధి చేయాలని సూచించారు. ఎకో టూరిజం మేనేజర్‌ సుమన్‌, పాండవుల గుట్ట సాహస క్రీడల నిర్వాహకుడు భాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని