దక్షిణ మధ్య రైల్వేకి రూ.62 కోట్ల చెక్కు

కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం అందజేసింది. ఈ కొత్త రైల్వేలైన్‌ని సింగరేణి కాలరీస్‌- దక్షిణమధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో

Published : 04 Dec 2021 05:30 IST

అందజేసిన సింగరేణి అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్‌ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం అందజేసింది. ఈ కొత్త రైల్వేలైన్‌ని సింగరేణి కాలరీస్‌- దక్షిణమధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. తన వాటా చివరి విడత మొత్తాన్ని ఇచ్చే క్రమంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కోల్‌ మూవ్‌మెంట్‌) జె.అల్విన్‌, జీఎం (కోఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) కె.సూర్యనారాయణ, జీఎం (సివిల్‌) రమేశ్‌బాబు సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో ద.మ.రైల్వే జీఎం గజానన్‌ మల్యని కలిసి చెక్కు అందజేశారు. ఈ ప్రాజెక్టు కోసం తన వంతుగా మొత్తం రూ.618.55 కోట్లను చెల్లించినట్లు సింగరేణి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్మాణపనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అల్విన్‌ కోరగా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మల్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ద.మ.రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ మేనేజర్‌ ఆర్‌.ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని