బూస్టర్‌ డోసుకు అనుమతించండి

కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడం వంటివి దృష్టిలో ఉంచుకొని వారికి బూస్టర్‌ డోసు వేసేందుకు

Published : 04 Dec 2021 05:32 IST

కేంద్ర మంత్రికి హరీశ్‌రావు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడం వంటివి దృష్టిలో ఉంచుకొని వారికి బూస్టర్‌ డోసు వేసేందుకు అనుమతించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు స్వీకరించడానికి 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయంటూ.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సూఖ్‌ మాండవీయకు శుక్రవారం లేఖ రాశారు. వలస కూలీలు మొదటి డోసు వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని, వారిని గుర్తించి రెండోడోసు వేయడం కష్టంగా మారిందన్నారు. రెండో డోసు వ్యవధిని 4-6 వారాలకు తగ్గించాలని సూచించారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది కొవిడ్‌ టీకాలకు అర్హులుగా గుర్తించామన్నారు. ఇప్పటి వరకూ 3.77 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. వైద్య ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది, పోలీసులు, పురపాలక, పంచాయతీరాజ్‌, రెవెన్యూ సిబ్బందికి రెండోడోసు వేసి ఇప్పటికే 8-10 నెలలు దాటిందని లేఖలో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని